వామన్‌రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్‌

వామన్‌రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్‌
x
Highlights

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ...

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని బండి సంజయ్‌ నిలదీశారు. వామన్‌రావును ప్రభుత్వ పెద్దలు బెదిరించారని, అయినా లొంగకపోవడంతోనే అడ్డుతొలగించుకున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతుల హత్య ద్వారా ప్రశ్నిస్తే చంపేస్తామనే హెచ్చరికలను ప్రభుత్వం పంపిందన్న బండి సంజయ్‌ కేసీఆర్ అరాచకాలపై న్యాయవాదులు ఉద్యమించకపోతే మరిన్ని దారుణాలకు పాల్పడుతుందని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories