Bandi Sanjay: మోడీ సభతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాం..

Bandi Sanjay: చరిత్ర తిరగరాసేందుకు బీజేపీ సన్నద్ధమైందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

Arun Chilukuri
Updated on: 26 Jun 2022 5:46 PM IST
Bandi Sanjay Puja At Parade Ground
X

Bandi Sanjay: మోడీ సభతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాం..

Bandi Sanjay: చరిత్ర తిరగరాసేందుకు బీజేపీ సన్నద్ధమైందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్‌లో అద్భుతం ఆవిష్కృతం కాబోతుందన్నారు. పేరెడ్ గ్రౌండ్లో ఏర్పాట్ల ఇన్‌ఛార్జి గరికపాటి రామ్మోహన్‌తో కలిసి వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. మార్పుకోసం ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం చేసేందుకు బీజేపీ బాధ్యతగా వ్యవహరిస్తొందన్నారు. సభకు ప్రజలు స్వచ్భందంగా తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచేలా మోడీ సభను సక్సెస్ చేస్తామన్నారు. తెలంగాణలో పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సభకు 10 లక్షల మందిని తరలిస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story