Bandi Sanjay: ఇవాళ్టి నుంచి బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay: 4వ విడత పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి

Jyothi
Published on: 12 Sept 2022 8:07 AM IST
Bandi Sanjay Praja Sangrama Yatra Begin
X

Bandi Sanjay: ఇవాళ్టి నుంచి బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర... ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. ఇక ఇవాళ్టి నుండి నాల్గో విడత పాదయాత్ర మొదలుకానుంది. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. గణేష్, విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పది రోజులకే కుదించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్.. 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు... 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story