International Yoga Day: సీఎం కేసీఆర్‌కు యోగా చేసే యోగం లేదు- బండి సంజయ్

International Yoga Day: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 1:48 PM IST
Bandi Sanjay Participated In International Yoga Day
X

International Yoga Day: సీఎం కేసీఆర్‌కు యోగా చేసే యోగం లేదు- బండి సంజయ్

International Yoga Day: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగాడే లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా ఇతర నేతలు పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించి.. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించేలా ప్రధాని మోడీ కృషి చేశారని కొనియాడారు బండి సంజయ్. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యోగా చేసే యోగం, సమయం లేదని విమర్శించారు. యోగా ప్రాముఖ్యతపై సందేశం ఇవ్వాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ద్వారా యోగాలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి యోగా గురు అరుణ, హిందు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, బీజేపీ నగర కార్యాలయం నుంచి యోగా డేలో పాల్గొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story