బండి సంజయ్‌ అయిదో విడత పాదయాత్ర 'భైంసా-కరీంనగర్‌'!

Bandi Sanjay Padayatra from 11th October
x

బండి సంజయ్‌ అయిదో విడత పాదయాత్ర ‘భైంసా-కరీంనగర్‌’!

Highlights

Bandi Sanjay: 11 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేటట్లు ప్రణాళిక

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు రూట్ మ్యాప్‌ ఖరారు చేశారు. దసరా సందర‌్భంగా పాదయాత్రను బైంసాలో ప్రారంభించి బండిసంజయ్ ఎంపీగా ప్రాతినిధ్య వహిస్తున్న కరీంనగర్‌ వరకు పాదయాత్రను సాగించే విధంగా షెడ్యూలును రూపొందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్‌.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగేలా షెడ్యూలుకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఐదో విడత పాదయాత్ర 20నుంచి 25 రోజుల పాటు దాదాపు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories