Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 10 Feb 2026 3:24 PM IST
Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
X

Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయ్యి రెండెళ్లయినా బెన్ ఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గంగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారని...రిటైర్డ్ ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా ? అని ఫైరయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా...? అని ప్రశ్నించారు. వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లింకపోతే...హైదరాబాద్‌ నడిబొడ్డున దీక్ష చేస్తానని బండి సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story