సీఎస్ సోమేష్‌కుమార్‌కు బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay Letter to CS Somesh Kumar
x

సీఎస్ సోమేష్‌కుమార్‌కు బండి సంజయ్‌ లేఖ

Highlights

Bandi Sanjay: బీజేపీ బృందం తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు అనుమతి కోరుతూ లేఖ

Bandi Sanjay: సీఎస్ సోమేష్‌కుమార్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ లేఖ రాశారు. బీజేపీ బృందం తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇరిగేషన్‌ నిపుణులతో కలిసి వెళ్తున్నామని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్‌ మొదటి వారంలో బీజీపీ బృందం సందర్శిస్తోందన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. భారీ వరదల కారణంగా మోటార్లకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని.. శ్రీశైలం టర్బైన్ దెబ్బతిన్నప్పుడు ప్రాజెక్ట్‌ను ప్రతిపక్షాలు సందర్శించాయని గుర్తుచేశారాయన. జలయజ్జంలో వచ్చిన విమర్శలకు అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని.. ప్రభుత్వ ఇరిగేషన్‌ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయండంటూ సీఎస్ సోమేష్‌ కుమార్‌కు బండి సంజయ్ లేఖరాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories