పోలీస్ రిక్రూట్మెంట్‌ నోటిఫికేషన్‌లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..

పోలీస్ రిక్రూట్మెంట్‌ నోటిఫికేషన్‌లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..

Arun Chilukuri
Updated on: 9 Oct 2022 3:54 PM IST
Bandi Sanjay Letter to CM KCR Regarding the Non Exemption of Cut Off Marks for EWS Candidates in Police Recruitment
X

పోలీస్ రిక్రూట్మెంట్‌ నోటిఫికేషన్‌లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..

Bandi Sanjay: పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఆర్దికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని మోదీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు బండి.

రాష్ట్ర ప్రభుత్వ తీరువల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. పోలీస్ రిక్రూట్ బోర్టు నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని ఆ లేఖలో బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story