బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ త్వరలో..

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ త్వరలో..
x
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ దూకుడు కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా,...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ దూకుడు కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, టీఆర్ఎస్‌ ప్రభుత్వంపైనా తన మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల హడావిడి ముగిసినా కూడా బండి దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. మొన్న దుబ్బాక ఉపఎన్నికలతో మొదలైన బండి రీసౌండ్‌ నిన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు కొనసాగింది. ఇప్పుడు ఢిల్లీ వేదికగా బండి సంజయ్‌ మరిన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. వంగి వంగి దండాలు పెట్టినా పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ బండి సంజయ్ హెచ్చరించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ అవినీతి చిట్టాను బయటపెడతామంటూ ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్ల రూపాయలు దోచేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. కాళేశ్వరం అంచనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుగోలుగా పెంచేసి దోపిడీకి పాల్పడ్డారని బండి విమర్శించారు. ఇప్పుడు మరో 25వేల కోట్లు దోచేందుకు మూడో టీఎంసీ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టారని బండి సంజయ్ ఆరోపించారు.

కేసీఆర్‌ ఢిల్లీ ఎందుకెళ్లారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో యుద్ధం చేస్తానన్న కేసీఆర్ ఏ గల్లీలో కత్తి తిప్పారో సమాధానం చెప్పాలంటూ సంజయ్ సెటైర్లు వేశారు. కాళేశ్వరంలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, అలాగే ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న బండి సంజయ్ కేసీఆర్ కట్టుకథలను ఢిల్లీ పెద్దలు నమ్మలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories