రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది.

Arun Chilukuri
Published on: 27 July 2022 4:50 PM IST
Bandi Sanjay Gives Clarity on Komatireddy Rajagopal Reddy Joining in BJP
X

రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. అయితే ఆయన ఎప్పుడు కాషాయ కండువా కప్పుకుంటారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా డేట్ త్వరలో నే పిక్స్ అవుతుందని, ఉప ఎన్నిక అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందన్నారు. చాలా మంది బీజేపీలో చేరుతారని, రాజ్ గోపాల్ రెడ్డి రాకతో పార్టీ మరింత పెరుగుతుందన్నారు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story