Etela Rajender: ఈటల బీజేపీలో చేరికపై స్పష్టత ఇచ్చిన బండి సంజయ్

Etela Rajender: వారంలో ఈటల బీజేపీలో చేరతారు: బండి సంజయ్

Sandeep Eggoju
Updated on: 2 Jun 2021 3:37 PM IST
Bandi Sanjay Gives A clarity on Etela Rajender joining in BJP
X

బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. వారంలో ఈటల బీజేపీలో చేరుతారని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. అందుకోసం న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. బీజేపీ హామీ లేకుండానే పార్టీలో చేరుతున్నారన్నారు బండి సంజయ్. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ పాలన నచ్చి పార్టీలోకి వలసలు పెరుగుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదికగా నిలుస్తోందని.. సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు..

సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు బండి సంజయ్..ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకు ఉందన్నారు. ఇతర పార్టీలు చేసే విమర్శలు తాము పట్టించుకోమన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవనీతి వివరాలు పూర్తిగా సేకరించామని ఇప్పటికే అధికార పార్టీకి చెందిన 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఓపినియన్ తీసుకున్నామన్నారు. తమ ఉద్యమ పంథానే వేరుగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీసుకున్నామని బండి సంజయ్ అన్నారు. వారం రోజులుగా సీఎం కేసుల పైనే ఆరా తీస్తున్నామన్నారు బండి సంజయ్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story