Bandi Sanjay: మరోసారి ప్రజాక్షేత్రంలోకి బండి సంజయ్

Bandi Sanjay: నాలుగో విడత ప్రజాసంగ్రామ యత్ర ఖరారు

Jyothi
Updated on: 5 Sept 2022 7:29 AM IST
Bandi Sanjay Fourth Praja Sangrama Yatra
X

Bandi Sanjay: మరోసారి ప్రజాక్షేత్రంలోకి బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రచేపట్టేందుకు షెడ్యూలు ఖరారు చేశారు. పదిరోజులపాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్లమేర పాదయాత్ర సాగేవిధంగా కార్యాచరణ ప్రణాళికతో షెడ్యూలు రూపొందించారు.

ఈనెల 12 తేదీన కుత్బుల్లాపూర్‌లో పాదయాత్ర ఆరంభమతుంది. 22 తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్‌రోడ్డులో ముగింపు సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈనెల 17 తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్వంలో నిర్వహించనున్నారు. ఈ సందర‌్భంగా నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరవుతారు. తెలంగాణ విమోచన దినోత్సవ సభ సందర‌్భంగా ఆ ఒక్కరోజు ప్రజాసంగ్రామ యాత్రకు బండి సంజయ్ విరామం ప్రకటించారు.


Jyothi

Jyothi

Next Story