Telangana: విద్యార్థి ఆత్మహత్యకు ముఖ్యమంత్రే కారణం- బండి సంజయ్

Telangana: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 2 April 2021 6:25 PM IST
Bandi Sanjay Extends Condolences to Sunil Naik’s Family
X

Telangana: విద్యార్థి ఆత్మహత్యకు ముఖ్యమంత్రే కారణం- బండి సంజయ్

Telangana: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం కేయూ విద్యార్ధి బోడా సునీల్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బండి సంజయ్‌ విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వ అసమర్థ పాలనే దీనికి కారణమని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. సునీల్ నాయక్ ది ఆత్మహత్య కాదని, ఇది కేసీఆర్ చేసిన హత్యగా ఆయ‌న మండిప‌డ్డారు.

సునీల్ ఆత్మహత్య చేసుకునే ముందు కేసీఆర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నోటిఫికేషన్లు రావడం లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని అని చెప్పి చనిపోయాడు కాబట్టి కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. ఉద్యోగం రావడం లేదంటూ ఆత్మహత్య చేసుకున్న సునీల్‌ నాయక్‌ కుటుంబ సభ్యులను బండి సంజయ్‌ పరామర్శించారు. పెద్దపల్లి జిల్లాలో వామనరావు దంపతుల హత్య కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ క్వైరీ పేరిట కాలయాపన చేస్తున్నారే తప్పా నిందితులను పట్టుకోవడం లేదని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story