Siddipet: సిద్దిపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

Siddipet: బండి సంజయ్‌పై సిద్దిపేట వన్‌టౌన్‌లో ఫిర్యాదు

Dhatripriya
Published on: 11 March 2023 3:42 PM IST
Bandi Sanjay Effigy Burnt In Siddipet
X

Siddipet: సిద్దిపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

Siddipet: ఎమ్మెల్సీ కవిత ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు హాజరైన కవితపై... అణుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story