Bandi Sanjay: బండి సంజయ్ జిల్లాల టూర్ తేదీలు ఖరారు

ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పర్యటనలు ఈనెల 8నుంచి 13 వరకు 6 జిల్లాల్లో పర్యటించనున్న బండి సంజయ్

Sandeep Reddy
Updated on: 5 July 2021 7:59 PM IST
Bandi Sanjay District Tours Dates Confirmed
X

బండి సంజయ్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల టూర్ తేదీలు ఖరారు అయ్యాయి. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా బండి సంజయ్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 8 నుంచి 13 వరకు ఆరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 8న హైదరాబాద్, 9న నాగర్ కర్నూల్‌,10న నిజామాబాద్, 11న కరీంనగర్, 12న సంగారెడ్డి, 13న, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాలకు బండి సంజయ్ హాజరు కానున్నారు.

జిల్లాల్లో పార్టీ పరిస్థితి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం కార్యక్రమాల తీరు పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాల రూపకల్పన చేపట్టనుంది. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాల్లోనే పర్యటించనున్నారు. ఈనెల 16న వేములవాడలో బీజేవైఎం ఎస్సీ మోర్చా రాష్ట్ర వర్గ సమావేశానికి బండి సంజయ్ హాజరు కానున్నారు. 18న యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన కిసాన్ మోర్చాలో రాష్ట కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ పాల్గొననున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story