రాష్ట్రంలో చట్టం ఒక వర్గానికే కొమ్ము కాస్తోంది: బండి సంజయ్‌

Bandi Sanjay: గాంధీలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన బండి సంజయ్.

Venkata Chari
Published on: 11 March 2021 9:54 PM IST
Bandi Sanjay Comments On Telangana Police
X

బండి సంజయ్ (ఫైల్ ఫొటో)

Bandi Sanjay: రాష్ట్రంలో చట్టం ఒక వర్గానికే కొమ్ము కాస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. బైంసా ఘటనలో గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని ఆయన పరామర్శించారు.

ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణా లో పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాయడం ఏంటని, ప్రజలకు సేవ చేయడమే పోలీసుల లక్ష్యం కావాలి అని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story