Bandi Sanjay: కవితపై... ఆ‍యన కుటుంబంపై లిక్కర్ స్కామ్‌తోనే... జీవో 51 సీక్రెట్‌గా ఉంచారు

Bandi Sanjay: జీవో విడుదల చేసిన 24 గంటల్లోనే పబ్లిక్ డొమైన్‌‌లో పెట్టాలి

Jyothi
Published on: 30 Oct 2022 1:45 PM IST
Bandi Sanjay Comments On CM KCR
X

Bandi Sanjay: కవితపై... ఆ‍యన కుటుంబంపై లిక్కర్ స్కామ్‌తోనే... జీవో 51 సీక్రెట్‌గా ఉంచారు 

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కూతురు కవితపై.. ఆ‍యన కుటుంబంపై లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలతోనే సీక్రెట్‌గా ఉంచిన జీవో 51ని తెరపైకి తెచ్చారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 30న జీవో 51ను తెచ్చారని... అయితే జీవో విడుదల చేసిన 24 గంటల్లోనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని.. కానీ ఇంతవరకు ఈ జీవోను సీక్రెట్‌గా ఉంచారని అన్నారు. సీబీఐకి నో ఎంట్రీ ఇచ్చేందుకు ఈ జీవోను బయట పెట్టారని అన్నారాయన.... హైకోర్టులో ఏజీ చెప్పే వరకు జీవో 51 గురించి విషయం బయటకు రాలేదని, కోర్టులో జీవోను సమర్పించే వరకు ప్రజలకు తెలియదని అన్నారాయన.

Jyothi

Jyothi

Next Story