సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
x
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికొస్తే ఎలాగుంటుందో దుబ్బాక ప్రజలు రుచి చూపించారని అన్నారు....

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికొస్తే ఎలాగుంటుందో దుబ్బాక ప్రజలు రుచి చూపించారని అన్నారు. కేసీఆర్‌కు నిజంగానే బీసీలపై ప్రేముంటే టీఆర్ఎస్‌ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు బండి సంజయ్. బీసీలకు అణగదొక్కుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. కులవృత్తుల మీద జీవించే బీసీల పొట్టపై కొడుతున్నారని బండి సంజయ్ అన్నారు.

నిజామాబాద్‌లో కేసీఆర్ బిడ్డను దుబ్బాకలో అల్లుడిని ఓడగొట్టామన్న బండి సంజయ్, GHMC ఎన్నికల్లో కేసీఆర్ బాక్స్ బద్దలుకొడతామన్నారు. ఇక, మంత్రులపైనా సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులంతా చెంచాగాళ్లేనని అసలు ఎందుకు ఆ బతుకు బతుకుతున్నారో తెలియడం లేదన్నారు. సీఎం పదవి కాపాడుకోవడానికి కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే కేసీఆర్ యాగాలు చేస్తారన్నారు బండి సంజయ్. కేసీఆర్ హిందువునని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హిందూగాళ్లు బొందూగాళ్లు అంటేనే టీఆర్ఎస్‌ను ప్రజలు బొందపెట్టారన్నారు. హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తే కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories