Bandi Sanjay: ఆదిలాబాద్‌ జనగర్జన సభలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా బండి సంజయ్‌

Bandi Sanjay: యువకులను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై కోప్పడిన బండి సంజయ్‌

Shekhar G
Updated on: 11 Oct 2023 8:15 AM IST
Bandi Sanjay As A Special Attraction In Adilabad Jana Garjana Sabha
X

Bandi Sanjay: ఆదిలాబాద్‌ జనగర్జన సభలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా బండి సంజయ్‌

Bandi Sanjay: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగర్జన సభలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం ముగిసిన అనంతరం.. వేదికపై ఉన్న బండి సంజయ్‌ను కలవాలని, ఆయనతో కరచాలనం చేయాలని స్థానిక యువత ఎగబడటంతో.. ఆయన కూడా అదే రీతిలో స్పందించారు. వేదిక పైనుంచే ఒక్కొక్కరికి బండి సంజయ్‌ కరచాలనం చేస్తుండటంతో పెద్దఎత్తున యువత ఆయన వద్దకు పరుగులు తీశారు.

బారికేడ్లను సైతం లెక్క చేయకుండా వాటిని దాటుకుంటూ ముందుకు వచ్చి మరీ బండిని కలిసేందుకు ఎగబడ్డారు. అయితే.. ఆ యువకులను పోలీసులు అడ్డగించడంతో.. ఒకానొక సందర్భంలో బండి సంజయ్‌.. పోలీసులపై కూడా మండిపడ్డారు. మొత్తానికి కొండంత అభిమానంతో దగ్గరకు వచ్చిన యువతకు బండి సంజయ్‌ ఇచ్చిన స్పందన చూసి.. అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా వారెవ్వా బండి సంజయ్‌ అంటూ కితాబులు ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story