Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు.. ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి

Bandi Sanjay: పాతబస్తీ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాం

Dhatripriya
Published on: 18 May 2023 4:04 PM IST
Bandi Sanjay About Muslim Votes
X

Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు.. ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బజరంగ్ దళ్‌ను నిషేధించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. హిందువులు చేతులు ముడుచుకుని కూర్చుంటే.. రేపు జై శ్రీరామ్ అన్నా జైల్లో వేస్తారన్నారు బండి సంజయ్. బీసీల గురించి మాట్లాడితే బీజేపీ మతతత్వ పార్టీ అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. తాము ఏ వర్గానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సమావేశం పెట్టి ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. పాతబస్తీ అభివృద్ధి గురించి మాట్లాడామని తెలిపారు. ముస్లింల అభివృద్ధి గురించి బీజేపీ ఆలోచిస్తే.. బీఆర్ఎస్, ఎంఐఎంలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story