Bandi Ramesh: స్థానిక సమస్యలే పట్టించుకోరు.. రాష్ట్రం ఏం అభివృద్ధి చేస్తారు

Bandi Ramesh: తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది శూన్యం

Shekhar G
Published on: 23 Nov 2023 7:33 PM IST
Bandi Ramesh Comments On BRS
X

Bandi Ramesh: స్థానిక సమస్యలే పట్టించుకోరు.. రాష్ట్రం ఏం అభివృద్ధి చేస్తారు

Bandi Ramesh: కూకట్‌పల్లి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్ షోతో పాలకపక్షంలో భయం మొదలైందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్.... కూకట్‌పల్లి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఆ‍యన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో స్థానిక ప్రజలు తమ సమస్యలను తెలియజేశారని వెల్లడించారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని శూన్యమని అన్నారాయన.... స్థానికంగా ఉండే సమస్యలే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మొత్తం ఏం అభివృద్ధి చేస్తుందని విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story