Bandari Lakshma Reddy: 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారు

Bandari Lakshma Reddy: దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు జీతభత్యాలు పెంచాం

Shekhar G
Updated on: 14 Nov 2023 9:16 PM IST
Bandari Lakshma Reddy On BRS Government
X

Bandari Lakshma Reddy: 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారు

Bandari Lakshma Reddy: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన కార్మికుల ఆత్మీయ సమ్మేళన సభకు ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. .బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు పెద్దపీట వేసిందని బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లు, సివిల్ సప్లై వర్కర్లు, ఆశా వర్కర్లతో పాటు జీహెచ్ఎంసీ కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా జీతభత్యాలు పెంచామని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అనే నినాదాన్ని తీసుకువచ్చి అనేక సంక్షేమ పథకాలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒకటే అన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారన్న ఆయన.. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story