ఎల్లమ్మ పాదాలను కడిగిన గంగమ్మ

Arun Chilukuri
Published on: 14 Oct 2020 5:41 PM IST
ఎల్లమ్మ పాదాలను కడిగిన గంగమ్మ
X

ఎల్లమ్మ పాదాలను గంగమ్మ కడిగేసింది. హైదరాబాద్ లో కనీవిని ఎరుగని రీతిలో వానలు పడటంతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోకి వరదనీరు ప్రవేశించింది. ఏకంగా గర్భగుడిని సైతం వరదనీరు ముంచెత్తింది.

ఉదయం ఆలయ పూజారులు గర్భగుడి తలుపులు తెరిచేసరికి అమ్మవారి విగ్రహం నీట మునిగింది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి బావిలో స్వయంభూగా వెలసింది. ఆ బావి ఇప్పుడు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయింది. ఆ వరదనీటిలోనే పూజారాలు అమ్మవారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story