ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తామంటూ బండి సంజయ్‌కి బాల్క సుమన్ వార్నింగ్

X
Highlights
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో బాల్‌ఠాక్రేను ఒక్క మాటంటే.. ...
Arun Chilukuri6 Jan 2021 1:24 PM GMT
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో బాల్‌ఠాక్రేను ఒక్క మాటంటే.. వాడు ఉంటాడా..?.. తెలంగాణలో కేసీఆర్‌ను ఇన్ని మాటలు అంటుంటే ఎందుకు ఊరుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంటే పదవులో ఉన్నవారిమని.. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమయ్యిందంటూ ప్రశ్నించారు. అడ్డమైన వారితో మాటలు పడేందుకా కేసీఆర్ తెలంగాణ తెచ్చింది అంటూ ఫైరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మీస్థాయిలో గట్టిగా స్పందించాలన్నారు. మిస్టర్ బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోనేది లేదంటూ ఓ రేంజ్‌లు మండిపడ్డారు.
Web TitleBalka Suman Sensational Warning to Bandi Sanjay
Next Story