Top
logo

బండి సంజయ్ పద్దతి మార్చుకోవాలి : బాల్క సుమన్

బండి సంజయ్ పద్దతి మార్చుకోవాలి : బాల్క సుమన్
X
Highlights

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలను ప్రభుత్వ విప్ బాల్క్ సుమన్...

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలను ప్రభుత్వ విప్ బాల్క్ సుమన్ తిప్పికొట్టారు. బండి సంజయ్ పద్దతి మార్చుకోకుంటే తాము అదే పదజాలాన్ని వాడుతామంటు హెచ్చరించారు. కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నందున తాము బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పారు. పరుష పదజాలం తమకూ వచ్చన్నారు.

కేసీఆర్ ను విమర్శించడమే కాదు ఎంపీగా కరీంనగర్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. స్మార్ట్‌ సిటీ నిధులను ఢిల్లీలోనే ఆపించే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్‌ను నిందించారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారని వ్యాఖ్యానించారు. మేమూ నీలాగా చిల్లరగా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Web Titlebalka suman comments on bandi sanjay
Next Story