Balapur Ganesh: రికార్డు ధరకు బాలపూర్‌ లడ్డూ... పోటాపోటీగా సాగిన వేలంపాట.. ఎంత పలికిందంటే..

Balapur Ganesh: లడ్డూ దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి

Jyothi
Updated on: 9 Sept 2022 1:35 PM IST
Balapur Ganesh Laddu Auctioned For Whopping Price Of Rs 24.60 Lakhs
X

Balapur Ganesh: రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ...

Balapur Ganesh: బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను 24లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. దీంతో వేలంపాట రసవత్తరంగా సాగింది. చివరికి వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక నేతలు హాజరయ్యారు.

1994 నుంచి బాలాపూర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. తొలుత 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట.. 2021లో రికార్డు స్థాయికి చేరి 18 లక్షల 90 వేలకు పలికింది. తాజాగా ఆ రికార్డ్‌ను అధిగమించి ఏకంగా 24 లక్షల 60 వేలకు పలకడం విశేషం. వేలంపాటకు ముందు బాలాపూర్‌ వీధుల్లో గణేశుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.


Jyothi

Jyothi

Next Story