తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ బలగం సింగర్‌.. స్పందించిన మంత్రి హరీశ్‌ రావు

Balagam Movie: 'బలగం' సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డాడు.

Arun Chilukuri
Published on: 30 March 2023 3:52 PM IST
Balagam Movie Singer Bedridden, Harish Rao Responds
X

తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ బలగం సింగర్‌.. స్పందించిన మంత్రి హరీశ్‌ రావు

Balagam Movie: 'బలగం' సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డాడు. కిడ్నీలు పాడై డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. గత కొంత కాలంగా మొగిలయ్య శరీరం డయాలసిస్‌కు కూడా సహకరించడం లేదంటున్నారు వైద్యులు. డయాలసిస్‍ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్‍ పాయింట్‍ దొరకడం చాలా కష్టంగా ఉందంటున్నారు. దీనికోసం ఇప్పటికే మొగిలయ్య శరీరంపై దాదాపు 11చోట్ల రంధ్రాలు చేశారట. చివరకు ఛాతి మీది నుంచి కూడా రక్తం ఎక్కిస్తున్నారట. ఈ క్రమంలోనే మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

ఇక మొగిలయ్య ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా చేస్తున్నా.. వారానికి మూడుసార్లు దుగ్గొండి నుంచి వరంగల్​సంరక్ష ఆస్పత్రికి రావడం కొమురయ్య దంపతులకు ఆర్థికంగా భారంగా మారింది. వరంగల్​కి వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతోందని ఆమె వాపోతుంది. మొగిలయ్య వైద్యం కోసం ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని.. అందులో 6 లక్షల రూపాయలు అప్పులే చేశామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం తెలిసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు మొగిలయ్యకు అండగా ఉంటామన్నారు. మొగిలయ్యను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లి అన్నిరకాల పరీక్షలు చేసి అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయనకు డయాలసిస్‌ సహా మెరుగైన వైద్యం అందించి, మందులు ఇవ్వాలని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story