Bakrid Festival 2021: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

* కోవిడ్ కారణంగా ఇళ్లలోనే ముస్తిం సోదరుల ప్రార్ధనలు * త్యాగాల పండుగగా బక్రీద్‌కు పేరు * మూడు రోజులపాటు బక్రీద్ వేడుకలు

Sandeep Reddy
Updated on: 21 July 2021 11:06 AM IST
Bakrid Festival Celebrations in Telangana
X

బక్రీద్ వేడుకలు

Bakrid Festival 2021: తెలంగాణ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ఎవరికి వాళ్లు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకుంటున్నారు. ముస్లిం సోదరుల త్యాగాల పండుగగా పేరున్న బక్రీద్‌కు ఉదయమే నిద్రలేచి, ప్రత్యేక ప్రార్ధనలు పూర్తి చేసుకుని జంతుబలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఇందుకోసం సిద్దం చేసిన జంతువులను పెంచడంతో పాటు అన్నీ ప్రత్యేకతలే కనిపిస్తాయి. చివరికి బక్రీద్ పండుగ ప్రారంభమైన నాటి నుంచి నుంచి మూడు రోజుల్లో ఏదో ఒక రోజు జంతుబలి ఇవ్వడం ద్వారా చరిత్రలో దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story