Suryapet: కన్న పేగులనే బలి చేస్తున్న పైశాచికం

Suryapet: వీళ్లకు ఇదేం పోయే కాలమో ఇదేం అజ్ఞానమో ఇదేం మూఢ భక్తో అసలే అర్థం కావడం లేదు.

Arun Chilukuri
Published on: 16 April 2021 3:30 PM IST
Baby Killed by Mother in Suryapet
X

Suryapet: కన్న పేగులనే బలి చేస్తున్న పైశాచికం

Suryapet: వీళ్లకు ఇదేం పోయే కాలమో ఇదేం అజ్ఞానమో ఇదేం మూఢ భక్తో అసలే అర్థం కావడం లేదు. శక్తులొస్తాయని కొందరు ఆత్మలు శాంతిస్తాయని ఇంకొందరు శివుడు కన్పిస్తాడని మరికొందరు కన్న బిడ్డలను బలి చేస్తున్నారు. మదనపల్లిలో ఇద్దరు కుమార్తెలను కిరాతకంగా తల్లిదండ్రులు పొట్టనబెట్టుకుంటే తాజాగా సూర్యాపేట తాండాలో నాగదోషం పోవడం కోసం ఆరు నెలల పసికిందును గొంతు కోసి చంపిందో మూర్ఖపు తల్లి.

మీడియాలో ఎంతగా ప్రచారం చేస్తున్నా ఇలాంటి దురాగతలపై ఎవేర్‎నెస్ క్రియేట్ చేస్తున్నా కొందరికి మాత్రం పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. భక్తి ఉండాలి. నమ్మకం ఉండాలి. కానీ మూఢభక్తితో కొందరు సాగిస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎక్కడో ఏదో జరిగిందని ఎవరో ఏదో చెప్పారని నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అసలు కన్న పేగులను చంపడానికి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు.

మొన్న మదనపల్లిలో భార్యభర్తలు ఇద్దరు యుక్తవయసు వచ్చిన బిడ్డలను కడతెరేరిస్తే తాజాగా సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం మేకలపాడు తండాలో ఆరు నెలల చిన్నారిని దోష నివారణ కోసం పొట్టనబెట్టుకుందో తల్లి. తండాలో బిడ్డను చంపిన తల్లి నిరక్షరాస్యురాలనుకుంటే పొరబాటే బీఈడీ చదువుకున్న భారతి నాగదోషం పోతుందని సొంత కూతురును పొట్టనబెట్టుకొంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story