నర్సంపేటలో భక్తజనరంజకంగా అయ్యప్ప పల్లివేట ఉత్సవం

* శ్రీ ధర్మశాస్త అయ్యప్పదేవాలయ ఆవరణలో ఉత్సవ వైభవం

R Tripura Malini
Published on: 9 Dec 2022 9:27 AM IST
Ayyappa Palliveta Festival In Narsampeta
X

నర్సంపేటలో భక్తజనరంజకంగా అయ్యప్ప పల్లివేట ఉత్సవం

Narsampeta: వరంగల్ జిల్లా నర్సంపేటలో అయ్యప్ప పల్లివేట ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష అభిషేకపూజలతో అయ్యప్పస్వామివారిని ఆరాధించిన భక్తులు నర్సంపేటలో పల్లివేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పదేవాలయ ఆవరణ ఉత్సవ వైభవాన్ని సంతరించుకుంది. అయ్యప్పమాల ధారణలో ఉన్నభక్తులు స్వామివారిసేవలో తరించారు. పల్లివేట ఉత్సవంలో భక్తులు అయ్యప్పస్వామిని కీర్తిస్తూ పదనర్తనతో తన్మయులయ్యారు. డప్పువాద్యాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అయ్యప్ప పల్లివేట ఉత్సవం ఆద్యంత భక్తజనరంజకంగా సాగింది. ఈ పూజాకార్యక్రమాల్లో నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ గుంటిరజినీ దంపతులు, బీజేపీ అధికార ప్రతినిధులు రాణీరుద్రమరెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story