Ayodhya Ram Mandir: సికింద్రాబాద్‌ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు

Ayodhya Ram Mandir: 40కి పైగా ట్రిప్పులను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధం

Shekhar G
Updated on: 24 Jan 2024 10:31 AM IST
Ayodhya Ram Mandir 17 Trains From Secunderabad To Ayodhya
X

Ayodhya Ram Mandir: సికింద్రాబాద్‌ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర దర్శనానికి సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించడంతో.. అందరి చూపు అయోధ్యపైనే ఉంది. దర్శనానికి అనుమతించడంతో హైదరాబాద్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివె‌ళ్లే అవకాశాలున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం నుంచి 17 ప్రత్యేక రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే ఏర్పాట్లు చేసింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకూ మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story