Rajanna Sircilla District: అయోధ్య శ్రీరాముని అక్షింతలు రాలేదని నిరసన

Rajanna Sircilla District: తాము అందరికీ సమాచారం ఇచ్చామంటున్న నిర్వాహకులు

Shekhar G
Published on: 7 Jan 2024 2:11 PM IST
Ayodhya is protesting that the Akshintalu of Lord Rama did not come
X

Rajanna Sircilla District: అయోధ్య శ్రీరాముని అక్షింతలు రాలేదని నిరసన

Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనాయపల్లిలో యువకులు రోడ్డుపై బైఠాయించారు. అయోధ్య శ్రీరాముని అక్షింతలు రాలేదని నిరసనకు దిగారు. వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయపల్లిలో రోడ్డుపై ధర్నా చేపట్టారు. గ్రామ పెద్దల తీరుకు నిరసన తెలిపారు. దళిత కాలనీలోకి అయోధ్య శ్రీరాముని అక్షింతలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వాడలు తిరిగి దళితవాడకు రాకపోవడమేంటని ప్రశ్నించారు. అయితే తాము అందరికీ సమాచారం ఇచ్చామంటున్నారు నిర్వాహకులు.

Shekhar G

Shekhar G

Next Story