Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా నేడు ఆటోల బంద్‌

Autos Cabs To Go On Strike In Hyderabad
x

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా నేడు ఆటోల బంద్‌

Highlights

Hyderabad: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయామని ఆవేదన

Hyderabad: నేడు హైదరాబాద్‌లో ఆటోల బంద్కు పిలుపు నిచ్చాయి ఆటోడ్రైవర్ల సంఘాలు. మహాలక్ష్మీ పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ,రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆటో బంద్ సంబంధించి తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికలిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రవాణాశాఖ కమిషనర్ ను కలిసి సమ్మె నోటీసులిచ్చారు. ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ణాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటోర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తామని, అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories