Auto, Cab Unions Protest: ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నం

Auto, Cab Unions Protest: ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నం
x
Highlights

Auto, Cab Unions Protest: ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి ఆటో,క్యాబ్‌డ్రైవర్ల యూనియన్లు మంగళవారం ప్రయత్నించారు.

Auto, Cab Unions Protest: ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి ఆటో,క్యాబ్‌డ్రైవర్ల యూనియన్లు మంగళవారం ప్రయత్నించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వారు ఈ ముట్టడి కార్యక్రమానికి యత్నించాయి. యూనియన్‌ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని పెద్దఎత్తున నిరసన తెలుపుతూ ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాలను సవరించాలని కూడా వారు కోరారు.

ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలని తెలిపారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం క్యాబ్‌ జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ టోల్ టాక్స్‌, రోడ్ టాక్స్‌లను వెంటనే ఎత్తివేయాలిని డిమాండ్‌ చేశారు. ఓల, ఉబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమిషన్ ఆపాలన్నారు. ఫిట్‌నెస్‌ ఇన్సూరెన్స్ చార్జీలను తగ్గించాలన్నారు. ఇంతకు ముందుకూడా డ్రైవర్ యూనియన్లు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని ఖైరతాబాద్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడానికి యత్నించారు. అప్పుడు అప్రమత్తమయిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేసారు.


Show Full Article
Print Article
Next Story
More Stories