ప్రగతిభవన్‌ వద్ద ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Arun Chilukuri
Published on: 18 Sept 2020 12:29 PM IST
ప్రగతిభవన్‌ వద్ద ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
X

హైదరాబాద్‌లో ప్రగతిభవన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలంటూ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట ఆటో డ్రైవర్ చందర్ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు. కిరోసిన్‌ పోసుకున్న అతడిపై నీళ్లు పోసి రక్షించారు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యా్యత్నం చేశానని బాధితుడు వాపోయాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు ఇల్లు కూడా మంజూరు చేయలేదంటూ నినాదాలు చేశాడు. ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కిసాన్ విభాగం ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story