Telangana: ఆత్మహత్యకు ముందు తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో

Telangana: సీనియర్లు అంతా ఒక్కటే

Jyothi
Published on: 26 Feb 2023 10:38 AM IST
Audio of Preeti Talking to her Mother
X

Telangana: ఆత్మహత్యకు ముందు తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో

Telangana: హెచ్‌ఎంటీవీ చేతికి మెడికో ప్రీతి ఫోన్ కాల్ ఆడియో చిక్కింది. ఆత్మహత్యకు ముందు తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. తనతో పాటు చాలా మంది జూనియర్లను సైఫ్‌ వేధిస్తున్నాడని తల్లికి చెప్పుకొని బాధపడింది. సీనియర్లు అంతా ఒక్కటేనని.. తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి పోలీసులతో నాన్న ఫోన్‌ చేయించినా... లాభం లేకుండా పోయిందని చెప్పింది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశానని.. HOD తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రీతి తల్లికి చెప్పింది. అయితే సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతితో ఆమె తల్లి చెప్పినట్లు ఆడియోలో ఉంది. అన్నిదారులు మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story