నవీపేట్: ఎల్లమ్మ ఆలయంలో దొంగల బీభత్సం.. హుండీ పగులగొట్టే ప్రయత్నం, తృటిలో తప్పిన ముప్పు!

Arun Chilukuri
Published on: 9 Feb 2026 5:05 PM IST
నవీపేట్: ఎల్లమ్మ ఆలయంలో దొంగల బీభత్సం.. హుండీ పగులగొట్టే ప్రయత్నం, తృటిలో తప్పిన ముప్పు!
X

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని దర్యాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. స్థానిక ఎల్లమ్మ ఆలయాన్ని టార్గెట్ చేసిన దుండగులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. గ్రామస్తుల అప్రమత్తత, హుండీ పగులగొట్టే క్రమంలో వచ్చిన పెద్ద శబ్దంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.

సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో ఆలయ గేటును ధ్వంసం చేశారు. లోపలికి వెళ్లిన తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు అక్కడున్న సీసీ కెమెరాలను పగులగొట్టారు.

దొంగలు హుండీని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురై అక్కడి నుండి పరారయ్యారు. కెమెరాలు ధ్వంసం చేయడానికి ముందే దొంగల కదలికలు అందులో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story