మంచిర్యాల జిల్లా జైపూర్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

Mancherial: గ్యాస్ కట్టర్‌లతో ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు, పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పారిపోయిన దుండగులు.

Jyothi
Updated on: 2 Feb 2022 11:15 AM IST
Attempted Robbery at Jaipur ATM in Mancherial District
X

మంచిర్యాల జిల్లా జైపూర్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి జైపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి నలుగురు దుండగులు ప్రవేశించారు. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేశారు. అయితే పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అటుగా రావడంతో అక్కడి నుంచి ఉడాయించారు.

పోలీసులు ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి చూడగా, గ్యాస్‌ కట్టర్లు, ఇనుప రాడ్లు లభించాయి. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అందులో ఉన్న 22 లక్షలు చోరీకి గురి కాలేదని తెలిపారు. కాగా, దుండగులను గుర్తించడానికి ఏటీఎం కేంద్రంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story