Hyderabad: హైదరాబాద్‌ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

Hyderabad: తాజాగా హైదరాబాద్‌లోని 5 పబ్బుల్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Sept 2024 3:10 PM IST
Attacks on pubs in Hyderabad Four people are positive for drugs
X

హైదరాబాద్‌ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

Hyderabad: డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని 5 పబ్బుల్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. దాడుల్లో భాగంగా 37 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో టెస్టులు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

కోరం క్లబ్‌లో ఇద్దరికి, బేబిలోన్‌ పబ్‌లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. చిన్న నిగేష్‌(వరంగల్‌), నార్త్‌ రవికుమార్‌(శ్రీకాకుళం), కేశవరావు(మూసేపేట), చార్మినార్‌కు చెందిన రహీమ్‌లకు పాజిటివ్‌గా గుర్తించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story