టీఆర్ఎస్ మహిళా నేత చైతన్యరెడ్డిపై దాడి

Arun Chilukuri
Updated on: 20 Dec 2020 12:02 PM IST
టీఆర్ఎస్ మహిళా నేత చైతన్యరెడ్డిపై దాడి
X

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో టిఆర్ఎస్ మహిళా నాయకురాలిపై దాడి జరిగింది. ఈ రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చైతన్య రెడ్డి ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఇద్దరు యువకులు ప్రవేశించారు. ఇంట్లోనున్న డైనింగ్ టేబుల్ పై ఉన్న గ్లాస్ తో చైతన్య రెడ్డిపై దాడికి ప్రయత్నించగా, ఆమె తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చైతన్య రెడ్డి కడుపులో ఓ ఆగంతకుడు తన్నాడు. తనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చైతన్య రెడ్డి ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలు ఇంటికి చేరుకుని దాడి వివరాలు తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story