Bhiknoor: భిక్కనూర్ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి.. టోల్ కట్ అయిందని దాడి చేసిన వ్యక్తి

Attack On Staff At Bhiknoor Toll Plaza
x

Bhiknoor: భిక్కనూర్ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి.. టోల్ కట్ అయిందని దాడి చేసిన వ్యక్తి

Highlights

Bhiknoor: డబ్బులు ఏవిధంగా కట్ చేస్తారంటూ సిబ్బందిని ప్రశ్నించిన వెంకట్ రెడ్డి

Bhiknoor: టోల్ ప్లాజా వద్ద టోల్ కట్ అయిందని ఏకంగా ఓ వ్యక్తి టోల్ ప్లాజా సిబ్బందిపై, మేనేజర్‌పై కర్రతో దాడి చేసిన ఘటన భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వెంకటరెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి నుంచి భిక్కనూర్ వైపు కారులో వెళుతున్న సమయంలో టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ టాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా 90 రూపాయలు కట్ అయ్యాయి. దీంతో వెంకటరెడ్డి కోపంతో డబ్బులు ఏవిధంగా కట్ చేస్తారంటూ టోల్ ప్లాజా సిబ్బందిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీంరెడ్డికి ఫోన్ చేశాడు.

వెంటనే టోల్ ప్లాజా వద్దకు భీంరెడ్డి మద్యం మత్తులో చేరుకొని కోపంతో టోల్ ప్లాజా సిబ్బందిపై బూతులు తిడుతూ... టోల్ ప్లాజా మేనేజర్ పై కర్రతో దాడి చేశాడు. సుమారు అరగంటపాటు అక్కడ నానా హంగామా సృష్టించాడు. దీంతో టోల్ ప్లాజా సిబ్బందికి భీమ్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక భిక్కనూర్ పోలీసులకు సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భీంరెడ్డిని స్టేషన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories