Hyderabad: అమానుషం.. కుక్కను పెంచుకుంటున్న ఫ్యామిలీపై దాడి

Attack on a family raising a dog in Hyderabad
x

Hyderabad: అమానుషం.. కుక్కను పెంచుకుంటున్న ఫ్యామిలీపై దాడి

Highlights

Hyderabad: రోడ్డుపై వెళ్తున్న శ్రీనాథ్‌తో పాటు, కుక్కపై దాడి

Hyderabad: పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగిలడంతో, ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్‌ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో జరిగింది. రహమత్‌నగర్‌లో ఉంటున్న మధు, నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులుగొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతికారంతో రగిలిపోయాడు.

దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు. ఇదిలా ఉండగా...మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్‌కు బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసి వచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ప్రాణంలా చూసుకునే కుక్కను ధనుంజయ్ కొడుతుంటే..శ్రీనాథ్, అతడి కుటుంబ సభ్యులు కుక్కను కాపాడే ప్రయత్నంలో అడ్డుకున్నారు. దీంతో మూకుమ్మడిగా మధు కుటుంబీకులపై ఇనుప రాడ్లతో శ్రీనాథ్‌ వర్గం దాడి చేసింది. దెబ్బలతో కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories