హైదరాబాద్ దమ్మాయిగూడలో దారుణం

Hyderabad: రఘుపతి అనే వ్యక్తిపై కత్తులతో దాడి

Jyothi
Published on: 16 July 2022 6:49 AM IST
Atrocious in Dammaiguda, Hyderabad
X

హైదరాబాద్ దమ్మాయిగూడలో దారుణం

Hyderabad: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో దారుణం జరిగింది. భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా గల ఎన్వీఆర్ వైన్స్ వెనుకాల రఘపతి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతన్ని దమ్మాయిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రఘుపతి చనిపోయాడు. మృతుడు రఘుపతి గతంలో ఓ హత్య కేసులో నిందితుడు. ఘటన స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Jyothi

Jyothi

Next Story