TS Assembly: ఈనెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: బీఏసీ సమావేశంలో నిర్ణయం

Jyothi
Published on: 7 Sept 2022 8:05 AM IST
Assembly Meetings on 12th and 13th of this Month
X

TS Assembly: ఈనెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వాయిదా వేశారు. ఉభయ సభల సమావేశాలను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా జరిగిన బీఏసీ సమావేశాల్లో నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సభా కార్యక్రమాలను 12, 13 తేదీలలో నిర్వహించాలని బీఏసీలు నిర్ణయించాయి.

Jyothi

Jyothi

Next Story