Ashwini Kumar Choubey: లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లబోతుంది

Ashwini Kumar Choubey: ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు

Shekhar G
Published on: 24 Feb 2024 9:48 AM IST
Ashwini Kumar Choubey Comments On MLC Kavitha
X

Ashwini Kumar Choubey: లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లబోతుంది

Ashwini Kumar Choubey: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకు వెళ్లబోతుందని కేంద్ర పౌరసరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి అశ్విని చౌబే అన్నారు. పటాన్ చెరులో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్పయాత్రలో కేంద్ర మంత్రి అశ్విని చౌబే పాల్గొన్నారు. ప్రధాని మోడీ దేశంలో ప్రజా పరిపాలన అందిస్తూ దేశ సంస్కృతి, అభివృద్ధిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతున్నారని అన్నారు. ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story