తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర

డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో బోనాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 July 2024 9:42 AM IST
Ashada Masam bonala fair in Telangana from today
X

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆషాఢమాస బోనాల జాతర హోరెత్తనుంది. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నెత్తిన బోనాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాలు సంబురాలు షురూ అవుతాయి. ఈ నెల 21న ఉజ్జయిని, 28న లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఆగస్టు 4 వరకు బోనాలు పండుగ అంగరంగ వైభవంగా సాగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story