ఆశా వర్కర్ల ధర్నా.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వధువు.. ఇంతకి పెళ్లి కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?

Bride: కాసేపట్లో వివాహం అనగా పెళ్లికూతురు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే.!

Arun Chilukuri
Published on: 9 Dec 2021 6:25 PM IST
Asha Workers Protest Bride Stucked in Traffic jam
X

ఆశా వర్కర్ల ధర్నా.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వధువు.. ఇంతకి పెళ్లి కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?

Bride: కాసేపట్లో వివాహం అనగా పెళ్లికూతురు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే.! కరీంనగర్ జిల్లాలో ఇదే జరిగింది. ఆశా వర్కర్ల ఆందోళన పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికొడుకు బంధువులనూ టెన్షన్ పెట్టింది. మరి కొన్ని నిమిషాల్లోనే ముహూర్తం అనగా పెళ్లి కుమార్తె వెహికల్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. సమయం గడుస్తున్నా ఆశా వర్కర్లు ఆందోళన విరమించకపోవడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. ఇక లాభం లేదనుకున్న పెళ్లి కూతురి సోదరుడు బైక్‌పైనే ఆమెను కళ్యాణ మండపానికి తీసుకెళ్లాడు. దీంతో అప్పటి వరకూ టెన్షన్‌తో ఎదురు చూస్తున్న బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కరీంనగర్‌లోని టీజర్‌ నగర్‌లో చోటుచేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story