Asaduddin Owaisi: మరోసారి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

Asaduddin Owaisi Sensational Comments
x

Asaduddin Owaisi: మరోసారి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

Highlights

Asaduddin Owaisi: దేశంలో మొదటి టెర్రరిస్టు నాథురామ్‌ గాడ్సే

Asaduddin Owaisi: MIM జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటి టెర్రరిస్టు నాథురామ్‌ గాడ్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి శోభయాత్రలో గాడ్సే ఫోటోలు ప్రదర్శించారని.. గాడ్సే ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. తాము బిన్ లాడెన్‌, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా..అని ప్రశ్నించారు. గాడ్సే ఫోటోల ప్రదర్శనపై హైదరాబాద్ పోలీసులు సమాధానం చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్‌ చేశారు.

మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథురాం గాడ్సే ఫొటోలతో కొందరు డ్యాన్స్ చేశారని..వారు ఎవరని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఒసామా బిన్ లాడెన్ ఫోటోలతో ఎవరైనా డ్యాన్సులు, ర్యాలీలు చేస్తే..మజ్లిస్ పార్టీపై నోరు పారేసుకునే వారని చెప్పారు. ఎంఐఎం కారణంగానే హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని... పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను అరెస్ట్ చేసేవారన్నారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ఓవైసీ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories