YS Sharmila: చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కోసమే పోరాడతా

YS Sharmila: నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టి కేసీఆర్ పాలనపై పెట్టాలంటూ ట్వీట్‌

Shekhar G
Published on: 23 Jun 2023 7:59 PM IST
As A Child Of Telangana Till The Last Breath
X

YS Sharmila: చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కోసమే పోరాడతా

YS Sharmila: పార్టీ మార్పుపై వస్తున్న వార్తల మీద YSRTP అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందన్నారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు,తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయన్నారు షర్మిల. పనిలేని, పసలేని దార్శనికులు.. తన రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని కేసీఅర్ పాలనపై పెట్టాలని హితవు పలికారు. తన భవిష్యత్తు తెలంగాణతోనే అని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు షర్మిల. నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే అన్నారు.


Shekhar G

Shekhar G

Next Story