CP Anand: గణేష్ నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా 25 వేల మందితో బందోబస్తు

CP Anand: అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Sept 2024 7:30 PM IST
Arrangement with 25 thousand people without any problem for Ganesh immersion
X

CP Anand: గణేష్ నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా 25 వేల మందితో బందోబస్తు

CP Anand: హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామని.. దానికి వాళ్లు అంగీకరించారని తెలిపారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు వస్తారని... దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story